ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పాండవులను అనుగ్రహించిన పరమేశ్వరుడు

Sun, Jun 08, 2014, 10:34 AM
Related Image పాండవులు తమ వనవాస కాలంలో అనేక క్షేత్రాలను దర్శిస్తూ వెళ్లారు. ఆయా క్షేత్రాల విశిష్టతను గురించి తెలుసుకుంటూ, అక్కడ పూజాభిషేకాలు నిర్వహించారు. ఈ కారణంగానే కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడ పాండవులకు సంబంధించిన విశేషాలు తెలుస్తుంటాయి ... ఆనవాళ్లు కనిపిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రాలలో 'వేములవాడ' ఒకటిగా దర్శనమిస్తూ ఉంటుంది.

పురాణకాలం నాటిదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం కరీంనగర్ సమీపంలో విలసిల్లుతోంది. నారద మహర్షి అభ్యర్థన మేరకు భూలోకానికి వచ్చిన పరమశివుడు, భక్తులను ఉద్ధరించడం ఇక్కడ రాజరాజేశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఇంతటి విశిష్టమైన ఈ క్షేత్రాన్ని ద్వాపరయుగంలో పాండవులు దర్శించుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోలేదు.

ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకుని రాజరాజేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో అరాధించారు. రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో శక్తిమంతమైన ఆయుధాలను పొందారు. ఇక రాజరాజేశ్వరీదేవిని పూజించిన 'ద్రౌపతి' ... ఆ తల్లి అనుగ్రహంతో అఖండ సౌభాగ్యాన్ని పొందింది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ... స్వామివారి అనుగ్రహాన్ని సంపాదించడం వల్లనే కౌరవులపై పాండవులు విజయాన్ని సాధించినట్టు చెబుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254