ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగేంద్రుడికి దర్శనమిచ్చిన నారాయణుడు

Sat, Jun 07, 2014, 07:46 PM
Related Image ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహా భక్తులు శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేశారు. అసమానమైన వారి భక్తికి మెచ్చిన భగవంతుడు, వాళ్లు కోరినవి ఆనందంగా అనుగ్రహించాడు. ఈ నేపథ్యంలో భక్తుల కోరికమేరకు స్వామి ఆయా ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అవన్నీ కూడా పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. అశేష భక్త జనకోటికి విశేష ఫలితాలను అందిస్తున్నాయి. అలాంటివాటిలో నూటాఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి.

ఈ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా 'తిరునాగై' గా పిలవబడుతోన్న 'నాగపట్టణం' దర్శనమిస్తుంది. ఓడరేవుగా ప్రసిద్ధిచెందిన ఈ ప్రాంతం తమిళనాడు - తంజావూరు సమీపంలో విలసిల్లుతోంది. పూర్వం నాగేంద్రుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'నాగపట్టణం' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడి స్వామివారు 'సౌందర్యరాజ పెరుమాళ్' పేరుతోను ... అమ్మవారు సౌందర్య వల్లి తాయారు పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని ఎంతోమంది రాజులు దర్శించారు. ఆలయ నిర్మాణంలోను ... అభివృద్ధిలోను తమవంతు పాత్రను పోషించారు. ఆలయంలోని ప్రతి నిర్మాణం ఆనాటి వారి అంకితభావానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.

తిరుమంగై ఆళ్వారులు స్వామివారిని కీర్తించి తరించిన ఈ క్షేత్రం, ఆనాటి వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామివారినీ ... అమ్మవారిని దర్శించడం వలన సకలశుభాలు చేకూరతాయి. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలు కనువిందు చేస్తాయి. అడుగడుగునా భక్తి భావ పరిమళాలను వెదజల్లుతూ భారీగా జరిగే ఈ సందడిని చూస్తుంటే, ఎవరికైనా ఆ స్వామి సన్నిధిలోనే ఉండిపోవాలనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222