ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదే ఈ పుష్కరిణి ప్రత్యేకత !

Wed, May 28, 2014, 01:11 PM
Related Image సాధారణంగా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన వాళ్లు, అక్కడి పుణ్యతీర్థాలలో స్నానమాచరించి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. ఎటు చూసినా ఎత్తైన కొండలు మాత్రమే కనిపించే క్షేత్రాలకు వెళ్లినప్పుడు, అక్కడ స్వచ్ఛమైన నీటితో నిండిన తీర్థాలు ఎలా ఏర్పడ్డాయా అనే ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. ఈ పుణ్యతీర్థాలు ఏర్పడటం గురించి ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది.

చాలా వరకూ ఆయా క్షేత్రాలలోని ప్రధాన దైవాల సంకల్పం మేరకే ఈ తీర్థాలు ఆవిర్భవించినట్టు స్థలపురాణాన్ని బట్టి తెలుస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీమహావిష్ణువు చక్రంతో సృష్టించిన తీర్థాలు ... శివుడు త్రిశూలాన్ని నేలకు తాకించడం వలన ఏర్పడిన తీర్థాలు ... శివకేశవుల పాదముద్రల నుంచి ఏర్పడిన తీర్థాలు కనిపిస్తుంటాయి. అలాగే శ్రీమహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి, ఆ రూపంతో స్వయంగా తవ్విన తీర్థాలు కూడా ఈ జాబితాలో మనకి కనిపిస్తుంటాయి.

అలా ఆవిర్భవించిన తీర్థం మనకి కృష్ణాజిల్లా 'ఆగిరిపల్లి'లో కనిపిస్తుంది. లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన ఈ క్షేత్రంలో, 'వరాహపుష్కరిణి' ప్రత్యేకతను సంతరించుకుని దర్శనమిస్తుంది. స్వామివారు ఆవిర్భవించినప్పుడు ఈ కొండపై ఎలాంటి జలాశయం లేకపోవడంతో, ఆయన వరాహ రూపాన్ని ధరించి ఈ కోనేరును తవ్వినట్టు స్థలపురాణం చెబుతోంది.

కొన్ని పుణ్యతీర్థాలు అందులో స్నానం చేయడం వలన మాత్రమే ఫలితాన్ని ప్రసాదిస్తూ వుంటాయి. మరికొన్ని తీర్థాలు వాటిలోని నీటిని తలపై చల్లుకున్నందు వల్లనే శుభాలను చేకూరుస్తుంటాయి. అలాంటిది ఈ క్షేత్రంలోని వరాహ పుష్కరిణిని చూడటం వల్లనే సమస్త పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయని చెప్పబడుతోంది. ఈ కారణంగా ఇది మరింత మహిమాన్వితమైన తీర్థంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152