ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ధన్యులను చేసే అష్ట సోమేశ్వరలింగాల దర్శనం

Tue, May 27, 2014, 01:28 PM
Related Image విశ్వవ్యాప్తంగా పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన లీలావిశేషాలను చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలు జ్యోతిర్లింగాలుగా ... పంచారామాలుగా వెలుగొందుతున్నాయి. సదాశివుడు ఎక్కడ కొలువైనా దాని వెనుక బలమైన కారణం వుంటుంది ... భక్తులను అనుగ్రహించాలానే ఆరాటం వుంటుంది.

అలా కొలువుదీరినవిగా 'అష్టసోమేశ్వర క్షేత్రాలు' దర్శనమిస్తున్నాయి. అత్యంత శక్తిమంతమైనవిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాలు, పురాణ సంబంధమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. తారకాసురుడిని కుమారస్వామి సంహరించగా, అసురుడి మెడలోని 'అమృతలింగం' అయిదు భాగాలై .. అయిదు ప్రదేశాల్లో పడుతుంది. అవే 'పంచారామాలు'గా ప్రసిద్ధి చెందాయి.

ఈ అయిదు భాగాలలో ఒకటి ఇప్పటి ద్రాక్షారామంలో పడగా, దానిని అక్కడ ప్రతిష్ఠించడానికి సప్తరుషులు వెళతారు. అయితే ఆ ప్రదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రత ఉండటం ... అక్కడ శివలింగ భాగం ప్రతిష్ఠించబడి వుండటం చూసి ఆశ్చర్యపోతారు. తనని సూర్యుడు ప్రతిష్ఠించడం వల్లనే ఆ ప్రదేశం అంత వేడిగా ఉందనీ, చల్లదనం కోసం తనకు ఎనిమిది దిక్కులలోను సోమలింగాలను ప్రతిష్ఠించమని సూర్యుడితో పాటు సప్తరుషులతో సదాశివుడు చెబుతాడు.

ఆదిదేవుడి ఆదేశం మేరకు ఆ ఎనిమిది మంది ఎనిమిది దిక్కులలో సోమలింగాలను ప్రతిష్ఠిస్తారు. అవే నేడు అష్ట సోమేశ్వర లింగాలుగా అలరారుతున్నాయి. కోలంక .. కోరుమిల్లి .. కోటిపల్లి .. వెల్ల .. వెంటూరు .. దంగేరు .. పెనుమళ్ల .. సోమేశ్వరం గ్రామాల్లో ఈ సోమలింగాలు దర్శనమిస్తూ వుంటాయి. శివుడి ఆదేశం మేరకు సూర్యుడితో కలిసి సప్తరుషులు ప్రతిష్ఠించిన ఈ క్షేత్రాలను దర్శించడం వలన, దారిద్ర్యం .. దుఃఖం నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254