ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భక్తుల బాధలను స్వీకరించే బాబా

Thu, May 22, 2014, 09:17 AM
Related Image దేవతలకు ... సాధు సత్పురుషులకు ... రాజులకు జ్ఞాన - యోగ మార్గాలను గురించి దత్తాత్రేయుడు ఉపదేశించాడు. ఆ స్వామి అవతారంగా శ్రీ శిరిడీసాయిబాబా చెప్పబడుతున్నాడు. తన నుంచి భక్తులు కోరుకునే ప్రేమానురాగాలను విరివిగాపంచే బాబా, తన అనుగ్రహాన్ని పొందాలంటే శ్రద్ధ - సహనం వుండాలని చెప్పాడు.

సాధారణంగా ఏదైనా ఒక కష్టం వచ్చిందని ఎవరి దగ్గరికైనా వెళితే, ఆ కష్టం తీర్చడానికి తమవంతు సాయం చేస్తారు. కానీ ఆ కష్టాన్ని తాము స్వీకరించి, అవతలివారిని బాధల నుంచి విముక్తి చేసే వాళ్లు మాత్రం ఎక్కడా కనిపించరు. అలాంటి పనిని బాబా మాత్రమే చేశాడు కనుక, ఈ రోజున ఆయన ఆలయాలు అశేష భక్త జన సందోహంతో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి విశాఖపట్నం - కూర్మన్నపాలెంలో దర్శనమిస్తూ వుంటుంది.

భక్తుల సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం,అసమానమైన వారి భక్తికి అద్దంపడుతూ వుంటుంది. మల్లెపందిరిని తలపించేలా నిర్మించబడిన మంటపంలో బాబా, పౌర్ణమినాటి చంద్రుడిలా కనిపిస్తూ వుంటాడు. ఆయనని చూడగానే ఆవేదన మాయమై ఆ స్థానంలో ఆనందం చోటుచేసుకుంటూ వుంటుంది. ఇక్కడి సాయి మహిమలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తూ వుంటాయి.

బాబాను మనస్పూర్తిగా ఆరాధిస్తే, బాధలను ... కష్టాలను కర్పూరంలా కరిగిపోయేలా చేస్తాడని స్థానికులు చెబుతుంటారు. మనోహరంగా దర్శనమిస్తూ మనసుకి శాంతిని చేకూర్చే ఈ ఆలయంలో, అభిషేకాలు ... అలంకారాలు ... సేవలు అన్నీకూడా అంకిత భావంతో జరుగుతుంటాయి. బాబా పట్ల భక్తులకు గల విశ్వాసాన్ని చాటుతుంటాయి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3