ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సానరాయి లక్ష్మీదేవిగా మారిన వైనం !

Fri, May 16, 2014, 09:18 AM
Related Image దైవం భక్తుల నుంచి పవిత్రతను ఆశిస్తుంది ... భక్తులు దైవం నుంచి ప్రశాంతతను కోరుకుంటారు. నిస్వార్ధంతో సేవించిన భక్తులను ఆ దైవమే వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు ఎన్నోవున్నాయి. అసమానమైన భక్తులకు అందనంత దూరంలో ఉండలేక, ఆ భక్తుల ఇళ్లలోనే ఆవిర్భవించిన సంఘటనలు మరెన్నో కనిపిస్తాయి. అలాంటి ఒక సంఘటనకు కర్ణాటక ప్రాంతానికి చెందిన 'కల్లూరు' వేదికగా నిలుస్తోంది.

భక్తుడిని అనుగ్రహించడం కోసం, ఆయన చేతిలోని సానరాయి లక్ష్మీదేవిగా మారిన వైనం ఇక్కడ కనిపిస్తుంది. ఈ కారణంగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పుకుంటూ వుంటారు. పూర్వం ఈ గ్రామానికి చెందిన ఒక భక్తుడు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడట. ప్రతి యేడు కొల్హాపురి లక్ష్మీదేవిని దర్శించుకునే ఆయన, వయసు పైబడిన కారణంగా ఆ యేడు ఆమె దర్శనానికి వెళ్లలేకపోయాడు. ఇక ఆ తల్లిని చూసే భాగ్యం తనకి లేనట్టేనని కన్నీళ్లు పెట్టుకుంటూ సానరాయిపై గంధం తీయసాగాడు.

ఆ సమయంలోనే ఆయన చేతిలోని సానరాయి లక్ష్మీదేవి ఆకృతిని సంతరించుకుంటుంది. కళ్లముందే జరిగిన ఈ అద్భుతానికి ఆయన సంతోషంతో పొంగిపోయాడు. తన తల్లి తనని వెదుక్కుంటూ వచ్చిందని మురిసిపోయాడు. లక్ష్మీదేవి ప్రతిమగా మారిన ఆ సానరాయికి ఆయన ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అదే సమయంలోనే ఆయన పొలంలో వేంకటేశ్వరస్వామివారి విగ్రహం బయటపడింది. ఆ ప్రతిమ కూడా అమ్మవారి ప్రతిమ పరిమాణంలో వుండటం ఆ భక్తుడికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

అది అమ్మవారి మహిమగానే భావించిన ఆ భక్తుడు, ఆలయాన్ని నిర్మించి అందులో ఆ రెండు ప్రతిమలను ప్రతిష్ఠించాడు. మహిమాన్వితమైన ఆనాటి సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ అమ్మవారు - అయ్యవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారు ... అమ్మవారు స్వయంభువులు కావడం, భక్తుడిని సంతోషపెట్టడం కోసం వాళ్లు ఇక్కడ ఆవిర్భవించిన తీరు గురించి ఇప్పటికీ ఇక్కడ ఆసక్తికరంగా చెప్పుకుంటూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71