ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లంకెబిందెలను చూపించిన దేవుడు

Tue, May 13, 2014, 01:01 PM
Related Image నారు పోసినవాడే నీరు పోస్తాడు అనే నానుడి చాలా చోట్ల చాలా సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. ఈ నానుడికి తగినట్టుగానే గుడికట్టమని చెప్పిన దేవుడే అందుకు అవసరమైన నిధిని కూడా ఏర్పాటు చేసిన సంఘటన ఒక క్షేత్రంలో కనిపిస్తుంది. అదే గుంటూరు జిల్లాలోని 'యనమదల' ... ఇక్కడే వీరభద్రస్వామి ఆలయం విలసిల్లుతోంది. ఈ స్వామియే తన ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధిని భక్తుడికి అందజేసినట్టు స్థలపురాణం చెబుతోంది.

పూర్వం ఒక భక్తుడు తన గ్రామంలో వీరభద్రస్వామి మందిరాన్ని నిర్మించాలనుకుంటాడు. అందుకోసం ఆ పక్కనే గల గ్రామంలోని శిల్పిచేత స్వామి విగ్రహాన్ని ... నంది విగ్రహాన్ని తయారుచేయించి దున్నపోతుల బండిలో బయలుదేరుతాడు. మార్గమధ్యలో ఒక చెరువు పక్కనేగల చెట్టుకింద విశ్రమిస్తాడు. అప్పుడు ఆ భక్తుడికి స్వప్నంలో కనిపించిన వీరభద్రుడు, ఆ ప్రదేశంలోనే తన ఆలయ నిర్మాణం జరపమని ఆదేశిస్తాడు. అంత స్తోమత తనకి లేదని ఆ భక్తుడు చెప్పడంతో, దున్నపోతులను చెరువులోకి వదలమని సూచించి స్వామి అదృశ్యమవుతాడు.

మెలకువరాగానే ఆ భక్తుడు అలాగే చేస్తాడు. చెరువులోకి దిగిన దున్నపోతులు, కొమ్ములకు 'లంకెబిందెలు' తగిలించుకుని రావడం చూసి ఆ భక్తుడు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. విషయాన్ని అక్కడి గ్రామస్తులకు తెలియజేసి, ఆ నిధితో ఆలయాన్ని నిర్మిస్తాడు. అలా స్వామి ప్రసాదించిన లంకె బిందెలతో నిర్మించబడినది కావడం వలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఆ స్వామిపట్ల తమకి గల భక్తిశ్రద్ధలు చాటుకుంటూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69