ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాలిమట్టెలు

Fri, Jun 14, 2013, 11:32 AM
Related Image స్త్రీలకు వివాహ సమయంలో 'కాలిమట్టెలు' తొడుగు సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. బంగారం ఖరీదనే కాకుండా ... దానిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు కాబట్టి కాలికి పెట్టరు. అందువలన కేవలం వెండితో మాత్రమే కాలి మట్టెలు తయారు చేయిస్తుంటారు. ఇక వివాహసమయంలో తొడిగిన ఈ మట్టెలను స్రీలు ఎట్టి పరిస్థితుల్లోను తీయరు. ఒకవేళ అవి పాతబడి అరిగిపోవడం జరిగితే కొత్తవి తెచ్చుకున్న తరువాత మంచిరోజు చూసి మార్చుకోవడం జరుగుతుంది.

వివాహానికి సంబంధించిన వివిధ ఆచారాలకు అసలైన అర్ధాలు ఉన్నట్టే ... కాలి మట్టెలకు కూడా లేకపోలేదు. కాలు బొటనవ్రేలుకు ... రెండవ వ్రేలుకు మధ్య ఒరిపిడి జరగడం వలన, రక్త ప్రసరణ సరిగ్గా జరగడమే కాకుండా మనో వికారాలు నియంత్రించబడతాయి. ఈ కారణంగానే మట్టెలు బొటన వ్రేలు పక్కన ఉన్న వ్రేలుకు పెడుతుంటారు. పూర్వం గృహస్తులు ... సాధువులు ... యోగులు మొదలైన వారు పాదుకలు ధరించడంలోని ఆంతర్యం కూడా ఇదే.

భార్యా భర్తలు సమానమైన స్థాయిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, వారి కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఈ విధానాన్ని ఆచారంగా మార్చి మనకి అందించారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69