ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విచారాన్ని తొలగించే విశిష్ట క్షేత్రం

Fri, May 02, 2014, 12:53 PM
Related Image జీవితం ఎన్నో కష్ట నష్టాలకు వేదికగా కనిపిస్తూ వుంటుంది. వాటి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ నిరంతరం పోరాడుతూనే ఉంటారు. తమ శక్తి చాలదనుకున్నప్పుడు ఆ భగవంతుడిపైనే భారం వేస్తుంటారు. అలాంటి భక్తుల భారాన్ని తనపై వేసుకుని, వారికి మానసిక ప్రశాంతతను కల్పించే క్షేత్రం మనకి 'కోటీశ్వరం'లో కనిపిస్తుంది. సప్త మోక్షపురాలలో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, ఉడిపి సమీపంలో దర్శనమిస్తుంది.

ఇక్కడి శివలింగం 'కోటీశ్వర లింగం'గా భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. సువిశాలమైన ప్రాంగణంలో భారీగా కనిపించే ఈ ఆలయం, చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతూ వుంటుంది. గోపురాలు .. ప్రాకారాలు .. మంటపాలు .. స్తంభాలు ఇలా అడుగడుగునా శిల్పసౌందర్యం ఉట్టిపడుతూ వుంటుంది.

ఒకవైపున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ, మరోవైపున అత్యద్భుతమైన శిల్పకళా దృశ్యాలను ఆవిష్కరిస్తూ ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గల 'కోటితీర్థం' మహిమాన్వితమైనదని స్థలపురాణం చెబుతోంది. భక్తులు ఇందులో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు.

ఈ విధంగా చేయడం వలన, విచారానికి కారణమయ్యే కష్టనష్టాలు ... అనారోగ్యాలు తొలగించబడతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ... ఇక్కడంత ఎత్తున్న ధ్వజస్తంభం ఈ ప్రాంతంలో మరెక్కడా కనిపించదు. అంత ఎత్తున్న ధ్వజస్తంభం చూడటం ఒక చిత్రమైన అనుభూతిని కలుగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలను చూసితీరవలసిందే.
X

Feedback Form

Your IP address: 54.197.90.95