ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అసురుడి పేరున వెలసిన అద్భుత క్షేత్రం !

Tue, Apr 29, 2014, 03:50 PM
Related Image పౌరాణిక చరిత్రను పరిశీలిస్తే దేవతలకు ... దానవులకు మధ్య జరిగిన పోరాట దృశ్యాలే కనిపిస్తూ వుంటాయి. దానవులు వరాలను పొందడం ... దేవతలను ఎదిరించడానికి తమ వంతు ప్రయత్నాలు చేయడమే కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో శివుడు ... శ్రీహరి ఎంతోమంది అసురులను అంతం చేశారు. అలా లోక కల్యాణం కోసం కుమారస్వామి కూడా అసురులను సంహరించాడు.

ఈ నేపథ్యంలో ఆవిర్భవించిన క్షేత్రాలలో 'ఘటి' ఒకటిగా కనిపిస్తుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిస్తూ వుంటాడు. పూర్వం 'ఘటికాచలుడు'అనే రాక్షసుడు సాధు సత్పురుషులను ... దేవతలను హింసించసాగాడు. వాళ్ల అభ్యర్థన మేరకు కుమారస్వామి ఆ అసురుడిని సంహరిస్తాడు. అందరి కోరికపై భక్తులను అనుగ్రహించడం కోసం ఈ ప్రదేశంలో ఆవిర్భవిస్తాడు.

ఈ కారణంగా ఇక్కడ స్వామి ఘటి సుబ్రహ్మణ్యస్వామిగా కొలవబడుతున్నాడు. స్వామి సర్పరూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్ర విశిష్టత. ప్రాచీనకాలం నుంచి పూజించబడుతూ వచ్చిన ఈ స్వామివారు, మధ్యలో కొంతకాలం పాటు నిక్షిప్తమై ఆ తరువాత ఓ భక్తుడి ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. సర్పరూపంలో కొలువుదీరిన స్వామికి భక్తులు స్వయంగా అభిషేకాలు నిర్వహించే అవకాశం వుండటం ఇక్కడ కనిపించే మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్రంలో నరసింహస్వామి కూడా దర్శనమిస్తూ ధన్యులను చేస్తుంటాడు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి ... అనేక శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన వాళ్లు, తులాభారం తూగి తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204