ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇక్కడ హనుమంతుడు ఇలా వెలిశాడు !

Mon, Apr 28, 2014, 04:22 PM
Related Image శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడు. అలాగే తన భక్తులు ఎక్కడ భజనలు చేస్తారో హనుమంతుడు అక్కడికి చేరుకుంటాడు. ఈ నేపథ్యంలోనే హనుమంతుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. హనుమంతుడు ఒక్కో క్షేత్రంలో వెలసిన తీరు వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం కనిపిస్తూ వుంటుంది. అలాగే నిజామాబాద్ జిల్లా 'సారంగాపూర్' క్షేత్రంలోను ఆశ్చర్యచకితులను చేసే ఆసక్తికరమైన సంఘటన స్థలపురాణంగా వినిపిస్తూ వుంటుంది.

పూర్వం ఈ ప్రాంతంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు పడకపోవడంతో తాగడానికి మంచినీళ్లు కూడా లేకుండాపోయాయి. ఇక పొలాలు తడికి నోచుకోక బీడుబారిపోయాయి. దాంతో గ్రామస్తులంతా కలిసి హనుమంతుడిని ఆరాధించాలని నిర్ణయించుకున్నారు. పొడవైన ఓ రాయిని ఏటవాలుగా నిలిపి ... దానిని హనుమంతుడి ప్రతిమగా భావించారు. అనునిత్యం పూజాభిషేకాలు నిర్వహిస్తూ ... భజనలు చేయసాగారు.

అదే సమయంలో అటుగా వచ్చిన సమర్ద రామదాసు ఆ శిలకు నమస్కరించి, ఆ గ్రామస్తులను కరుణించమని స్వామిని కోరాడట. అంతే అంతా చూస్తుండగానే ఆ రాయిపై గీత గీసినట్టుగా హనుమంతుడి రూపం ఏర్పడిందట. మరుక్షణంలోనే ఆకాశం మేఘావృతమై బావులు ... చెరువులు నిండేలా భారీవర్షం కురిసిందట. ఇక ఆ గ్రామస్తుల సంతోషానికి అవధులు లేవు. ఆనాటి నుంచి స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నట్టుగా గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. ఆనాటి మహిమను తమ పూర్వీకుల ద్వారా తెలుసుకున్నవాళ్లు ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెబుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192