ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కుజదోషం గలవారు ధరించవలసిన రుద్రాక్ష

Wed, Apr 16, 2014, 06:43 PM
Related Image భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో రుద్రాక్షలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. రుద్రుడి కన్నీటి బిందువులే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి రుద్రాక్షలను ధరించడం వలన పుణ్య క్షేత్రాల్లో స్నానాలు ... యజ్ఞయాగాదులు ... దానధర్మాలు చేసిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. రుద్రాక్షలో ఒక నిలువు గీత నుంచి మరో నిలువు గీత వరకూ గల భాగాన్ని ఒక ముఖంగా చెబుతుంటారు.

ఇలా ఒకే రుద్రాక్షలో ఒకటి నుంచి 21 ముఖాలు గలవి ... 32 ముఖాలు గలవి కూడా వుంటాయి. కానీ అవి మరింతగా అరుదుగా లభిస్తూ వుంటాయి. ఒకటి నుంచి 14 ముఖాల వరకూ గలవి మాత్రమే ఎక్కువగా లభిస్తూ వుంటాయి. ఇక వీటిలోనూ కొన్ని అరుదుగా మాత్రమే దొరికేవి లేకపోలేదు. ఒక్కో రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను ... విశిష్టతను కలిగి వుంటుంది. వివిధ దోషాలతో బాధపడేవాళ్లు ఆ దోషాలను నివారించే రుద్రాక్షలను గురించి తెలుసుకుని ఆయా రుద్రాక్షలను ధరిస్తూ వుంటారు. వాటి కారణంగా మంచి ఫలితాన్ని పొందుతుంటారు.

ఈ నేపథ్యంలో కుజదోషం విషయంలో సాయపడే రుద్రాక్షను గురించి కూడా తెలుసుకోవలసి వుంటుంది. జీవితంలో వివాహమనేది ఒక ప్రధానమైన ఘట్టానికి తెరతీస్తుంది. అలాంటి వివాహానికి 'కుజదోషం' అడ్డుపడుతూ వుంటుంది. దాంతో ఇటు యువకులు ... అటు యువతులు వివాహం విషయంలో ఆలస్యమై మానసిక ఆందోళనకి లోనవుతుంటారు. ఇలా కుజదోషం కారణంగా ఇబ్బంది పడేవాళ్లు 'త్రిముఖ రుద్రాక్ష'ను ధరించవలసి వుంటుంది.

త్రిమూర్తులకు ప్రతీకగా కనిపించే ఈ రుద్రాక్ష కుజగ్రహంతో సంబంధాన్ని కలిగి వుంటుంది. అందువలన ఇది ధరించిన వారిపై కుజ గ్రహ ప్రభావం తక్కువగా వుంటుంది. ఈ రుద్రాక్ష ధరించడానికి ముందు ఆవుపాలతో శుద్ధి చేయాలి. ఆ తరువాత దానికి రుద్రాభిషేకం చేయించి సోమవారం రోజున ధరించాలి. ఈ రుద్రాక్షను ధరించి అపవిత్రమైన ప్రదేశాలకు ... మైల ప్రదేశాలకు వెళ్లకూడదు. ఈ విధమైన నియమ నిష్ఠలను పాటించడం వలన కుజుడి అనుగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. ఫలితంగా కుజదోషం నుంచి బయటపడి ఆశించిన ప్రయోజనాన్ని పొందవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96