ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పార్వతీదేవి పుట్టినరోజున ఏం చేయాలి ?

Thu, Apr 03, 2014, 01:13 PM
Related Image సర్వమంగళగా సమస్త లోకాలచే పూజలందుకుంటోన్న శక్తిస్వరూపిణి పార్వతీదేవి. లోక కల్యాణం కోసం అనేక రూపాలను ధరించి వివిధ నామాలతో కొలవబడుతోంది. ఆ తల్లిని ఆరాధించడం వలన తమ సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శిస్తూ ధన్యులవుతుంటారు. అలాంటి అమ్మవారు సతీదేవిగా తన అవతారం ముగించి పార్వతీదేవిగా జన్మించింది.

దక్షుడు కూతురు సతీదేవిగా జన్మించిన ఆ తల్లి, తన భర్తకు తండ్రివలన జరిగిన అవమానాన్ని సహించలేక దేహత్యాగం చేస్తుంది. ఆ తరువాత పార్వతీదేవిగా ... హిమవంతుడి దంపతులకు 'చైత్ర శుద్ధ అష్టమి' రోజున జన్మిస్తుంది. అందువలన ఈ రోజున అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. అమ్మవారి పుట్టినరోజు అంటే అది ఆ శివయ్యకు కూడా అత్యంత ప్రీతికరమైన రోజు కనుక, ఆదిదంపతుల అనుగ్రహం త్వరగా లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఇదే రోజుని 'అశోకాష్టమి' గా కూడా పిలుస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, అత్యంత పవిత్రమైన అశోక వృక్షాన్ని పూజించడం వలన శోకాలు దరిచేరవని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున అశోక వృక్షాన్ని ఆరాధించి, దాని మొగ్గలతో పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.211.120.181