ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూజలో గంటానాదం ప్రాముఖ్యత

Wed, Mar 26, 2014, 07:37 PM
Related Image పూజ అనే కార్యక్రమం ఎక్కడైతే కనిపిస్తుందో ... అక్కడి నుంచి తప్పని సరిగా గంటానాదం వినిపిస్తుంది. ప్రాచీనకాలం నుంచి కొనసాగుతోన్న పూజా విధానానికి గంటతో అంతటి అవినాభావ సంబంధం వుంది. గంట శబ్దం ఎంత దూరం వరకైతే వినిపిస్తుందో, అంతదూరం వరకూ దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే ప్రతి దేవాలయంలోను గంటలు వరుసగా వేళ్లాడదీసి కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ... తిరిగి వెళుతున్నప్పుడు మాత్రమే గంటను మోగించాలనే నియమం ఉంది. గంట శబ్దం శుభాన్ని సూచిస్తుంది. గంట మోగించడం వలన వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను మోసుకొస్తాయి ... మానసిక రుగ్మతలను దూరంచేస్తూ ప్రశాంతతను ప్రసాదిస్తాయి.

ఇక పూజా మందిరాల్లో చిన్నగంటలను ఉపయోగిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. పూజలో దైవ చిహ్నంగల గంటను మాత్రమే ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. ఒక్కో దైవ చిహ్నం కలిగిన గంటను మోగించడం వలన ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే గంటను ఇష్టానుసారంగా ... గందరగోళంగా కాకుండా లయబద్ధంగా మోగించాలి.

ముఖ్యంగా ధూప .. దీప .. నైవేద్యాల సమయంలోను, హారతినిచ్చే సమయంలోను గంటను తప్పనిసరిగా మోగించాలి. ఈ విధమైన నియమాలను పాటిస్తూ గంటను మోగించడం వలన పూజకి సంబంధించిన ఫలితం పరిపూర్ణంగా పొందడం జరుగుతుందని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152