ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చైత్రమాసాన ఏయే దేవతను పూజించాలి ?

Tue, Mar 25, 2014, 04:32 PM
Related Image తెలుగు సంవత్సరాదికి చైత్రమాసం శుభస్వాగతం పలుకుతుంది. గడచిన ఏడాదికంటే నూతన సంవత్సరం మరింత ఆనందమయంగా కొనసాగాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. పాడిపంటలు ... సిరిసంపదలు ... సుఖసంతోషాలతో తమ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని దైవాన్ని కోరుకుంటూ ఉంటారు.

ఇక కొత్త సంవత్సరమంతా తమకి మంచే జరగాలని ప్రతి ఒక్కరూ ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే శాస్త్రం సూచించిన విధంగా చైత్రమాసంలోని శుక్ల పక్షంలో తిథులను అనుసరించి ఆయా దేవతలను పూజిస్తే ఉత్తమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడుతోంది. చైత్రమాసంలో పాడ్యమి రోజున బ్రహ్మదేవుడిని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సమస్త సృష్టికి మూలకారకుడు బ్రహ్మదేవుడు. సృష్టి రచనకు ఆయన శ్రీకారం చుట్టినది ఈ రోజునే. అందువలన ఈ రోజున ఆయనను అంకిత భావంతో అర్చిస్తూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక విదియ - తదియ రోజుల్లో పార్వతీ పరమేశ్వరులను ... చవితి రోజున వినాయకుడిని .. పంచమి రోజున నాగేంద్రుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. అలాగే షష్ఠి రోజున కుమారస్వామినీ .. సప్తమి రోజున సూర్యుడిని .. అష్టమి రోజున పార్వతీదేవినీ .. నవమి రోజున శ్రీరామచంద్రుడిని పూజించాలి.

ఇక దశమి రోజున దుర్గాదేవిని .. ఏకాదశి - ద్వాదశి రోజుల్లో శ్రీమన్నారాయణుడిని .. త్రయోదశి రోజున మన్మథుడిని .. చతుర్థశి రోజున పరమశివుడిని .. పౌర్ణమి రోజున ఇంద్రుడిని పూజించాలి. ఈ విధమైన నియమాన్ని అనుసరిస్తూ ఆయా దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247