ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రుణ బాధలను నివారించే శైవ క్షేత్రం

Sat, Mar 22, 2014, 07:38 PM
Related Image ''ఏ జన్మలో చేసిన రుణమో ఈ జన్మలో ఇలా తీరింది'' అనే మాట చాలా చోట్ల వినడం జరుగుతుంటుంది. క్రితం జన్మలో చేసిన రుణమే ఈ జన్మలో కొన్ని బంధాలుగా చేరువై వాటిని తీర్చుకోవడం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ విషయం తెలిసినవాళ్లు చాలామంది రుణం ఉండకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.

ఇక జన్మజన్మలపాటు వెంటాడే ఈ రుణానుబంధం నుంచి బయటపడాలనుకునేవారికి శ్రీనాగనాథస్వామి ఆలయం ఒక ఆశాకిరణంలా కనిపిస్తుంది. మహారాష్ట్రలోగల ఈ క్షేత్రంలో శివపార్వతులు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. పురాణపరమైన విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రంలో ప్రత్యేకత కలిగిన కోనేరు కనిపిస్తూ ఉంటుంది. ఈ కోనేరులో స్నానం చేసిన వారు రుణ విముక్తిని పొందుతారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

ఈ కారణంగానే ఈ కోనేరును 'రుణ విమోచక తీర్థం' అని పిలుస్తూ ఉంటారు. ఇక భక్తులను రుణ విముక్తులను చేయడమే కాదు, వారికి గల శనిదోషాలు ... నాగదోషాలు ఈ క్షేత్రదర్శనం వలన నివారించబడతాయని స్థలపురాణం చెబుతోంది. పరివార దేవతలతో కలిసి భక్తుల పాపాలను పారద్రోలే ఇక్కడి స్వామివారి క్షేత్రం పర్వదినాల్లో మరింత సందడిగా కనిపిస్తుంది ... అనేక వరాలను ప్రసాదించే అక్షయ పాత్రలా అనిపిస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62