ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పంటపొలాలను రక్షించే పోలమాంబ క్షేత్రం

Fri, Mar 21, 2014, 10:02 AM
Related Image ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తన బిడ్డల జీవనోపాదిని కాపాడటానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే అమ్మవారిని అనేక నామాలతో పిలుచుకుంటూ, అంకిత భావంతో ఆమెను ఆరాధిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలా అమ్మవారు 'పోలమాంబ' పేరుతో కొలవబడుతోన్న క్షేత్రం మనకి విశాఖ జిల్లా 'పెదవాల్తేరు' లో దర్శనమిస్తుంది.

ఈ ప్రాంతానికి చెందిన పంటపొలాలను రక్షించడంలో అమ్మవారు ప్రధానమైన పాత్రను పోషిస్తుండటం వలన, పోలమాంబ పేరుతో ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన జాలరులు సముద్రంలో చేపల వేటకి వెళ్లగా అమ్మవారి విగ్రహం వలలో పడిందట. దాంతో జాలరులంతా అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించుకుని పూజించడం ప్రారంభించారు. ఈ కారణంగా ఈ అమ్మవారిని సముద్ర దేవతగా ... జలదేవతగా ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు.

ఇక్కడ వర్షాలు పడటానికీ ... ఆర్ధికపరమైన ఇబ్బందులు లేకపోవడానికి అమ్మవారి అనుగ్రహమే కారణమని నమ్ముతుంటారు. ఆ తల్లిని తమ ఇలవేల్పుగా భావించి తొలి పంటలో తొలి భాగాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. గర్భాలయంలో అమ్మవారితోపాటు కుంచమాంబ - నీలమాంబ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు అమ్మవార్లను పార్వతీదేవి .. లక్ష్మీదేవి .. సరస్వతీదేవిగా భక్తులు విశ్వసిస్తుంటారు.

త్రిశక్తి మాతలు కొలువుదీరిన ఈ క్షేత్రంలో, ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని తొమ్మిది రోజులపాటు జాతర జరుగుతుంటుంది. ఇక దసరా నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి రెండు కళ్ళూ సరిపోవు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, అమ్మవారికి మొక్కుబడులు చెప్పుకుంటూ ... చెల్లించుకుంటూ ఉంటారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219