ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆనందనవమి ప్రత్యేకత

Mon, Mar 10, 2014, 10:28 AM
Related Image ప్రపంచాన్నీ ... పరమాత్ముడిని అర్థం చేసుకోవడానికి ప్రతి వ్యక్తికి జ్ఞానం ఎంతో అవసరం. దుమ్ముచేత అద్దం కప్పబడి ఉన్నప్పుడు ప్రతిబింబం మసకగా కనిపిస్తుంది. ఆ దుమ్మును తొలగించినప్పుడు అదే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అజ్ఞానమనే తెరను జ్ఞానం చేత తొలగించినప్పుడే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచాన్ని వాస్తవిక దృష్టితో చూడగలుగుతారు. అలా జ్ఞానమనేది అభివృద్ధికీ ... ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

సమాజంలో కీర్తిప్రతిష్ఠలతో కూడిన స్థానాన్ని అందించే జ్ఞానాన్ని సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. ప్రశాంతమైన వదనంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించే ఆ తల్లిని ఫాల్గుణ శుద్ధ నవమి రోజున ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఈ రోజున 'ఆనందనవమి వ్రతం' ఆచరించాలి. అమ్మవారిని ఆరాధించే విషయంలో పంచమికి ఓ ప్రత్యేకత ఉంది కనుక, ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి నవమి వరకూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

పూజా మందిరంలో అయిదు వత్తులు గల రెండు కుందులలో దీపారాధన చేయాలి. అయిదు రోజుల పాటు అఖండ దీపం వెలిగేలా చూసుకోవాలి. అమ్మవారి వెండి ప్రతిమను ప్రతి ఉదయం పంచామృతాలతో అభిషేకించాలి. ఆ తల్లికి తెలుపు రంగు ప్రియమైనది కనుక తెల్లని పువ్వులతో అర్చిస్తూ ... నైవేద్యంగా పాయసాన్ని సమర్పిస్తూ ఉండాలి. ఈ అయిదు రోజుల పాటు ఏక భుక్తం ... నక్తం ఆచరిస్తూ వ్రతాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది.

అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరంభించిన ఈ ఆనందనవమి వ్రతానికి అంతే శ్రద్ధతో దశమి రోజున ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుంది. ఈ విధంగా సరస్వతీ దేవిని ఆరాధించడం వలన ఆ తల్లి సంతోషించి ... సంతృప్తి చెంది అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనీ, విజయాలను చేకూరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.238.62