ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హనుమంతుడు పెకిలించిన కొండ

Sat, Mar 01, 2014, 11:41 AM
Related Image రావణ సంహారం చేయడానికి రామలక్ష్మణులు యుద్ధరంగాన నిలుస్తారు. మేఘనాథుడుతో తలపడిన లక్ష్మణుడు, ఆయన అదృశ్య శక్తుల ధాటికి తట్టుకోలేక స్పృహకోల్పోతాడు. అప్పటికప్పుడు సంజీవిని ఔషధం అవసరం కావడంతో, ఆ మొక్కకోసం ఓ పర్వత భాగాన్ని పెకిలించుకు వస్తాడు హనుమంతుడు. ఆ పర్వత భాగం 'పెంచలకోన'లోదేనని ఆ క్షేత్ర స్థలపురాణం చెబుతోంది.

నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోన్న పెంచలకోన, నెల్లూరు సమీపంలో అలరారుతోంది. లక్ష్మీదేవి ... చెంచులక్ష్మిగా నరసింహస్వామిని పెనవేసుకున్న కారణంగా ... సంజీవిని మొక్క కోసం హనుమంతుడు ఇక్కడి పర్వతాన్ని పెకిలించిన కారణంగా ఈ క్షేత్రానికి పెంచలకోన అనే పేరు వచ్చినట్టు చెబుతుంటారు. ఇక్కడి పర్వతాన్ని పెకిలించడానికి హనుమంతుడు ప్రయత్నించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉండటం విశేషం.

రాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన లక్ష్మణుడిని మామూలు మనిషిని చేసి రాముడి దుఃఖాన్ని పోగొట్టినందుకు కృతజ్ఞతగా హనుమంతుడు ఈ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడని అంటారు. భక్తులు ఈ క్షేత్రానికి బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వాళ్లు ఇంటికి చేరుకునేవరకు హనుమంతుడు సంరక్షిస్తూ ఉంటాడని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా హనుమంతుడి దర్శనం చేసుకుంటారు.

మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, నరసింహస్వామి అవతారంలోని పరిణయ ఘట్టాన్ని ... రామావతారంలో సంజీవిని కోసం హనుమంతుడిని పంపించి ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. పవిత్రమైన ఈ క్షేత్రానికి పదే పదే ప్రణమిల్లాలని అనిపిస్తూ ఉంటుంది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229