ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అడవిలో దారి చూపే కాలభైరవుడు

Wed, Feb 26, 2014, 11:45 AM
Related Image కష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు ... ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవరైనా సరే దేవుడిపైనే భారం వేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి కారణంగా చిన్నపాటి సాయం లభించినా అది ఆ దేవుడి మహిమేననుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అలాంటిది దారీ తెన్నూ తెలియక అడవిలో చిక్కుకున్నవారిని ఒక మూగజీవి గమ్యానికి చేరిస్తే, అంతకన్నా మహిమాన్వితమైన సంఘటన మరొకటి ఉండదు.

అలాంటి మహిమాన్వితమైన క్షేత్రంగా 'భైరవకోన' కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చే ఈ దట్టమైన అడవిలో ప్రాచీనకాలంనాటి గుహాలయాలు కనిపిస్తాయి. ఈ గుహాలయాలలో పరమశివుడు ... పార్వతీదేవి ... భైరవుడు ... నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన తొమ్మిది శివలింగాలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతుంటారు. పరమపవిత్రమైన ఈ క్షేత్రాన్ని అనుక్షణం భైరవుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా ... అనుగ్రహం లేకుండా ఏ జీవరాశి కూడా ఈ క్షేత్రంలోకి ప్రవేశించలేదని చెబుతుంటారు.

ఇక ఈ క్షేత్రాన్ని దర్శించడం కోసం అడవిలో ప్రవేశించి దారితప్పిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అలా దారి తప్పిన వాళ్లు మరింత ప్రమాదకరమైన అడవిలోకి వెళ్లేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుబడిన భక్త బృందాలు తిరిగి ఆలయం దగ్గరికి క్షేమంగా చేరుకునేవి. ఓ కుక్క దారి చూపడం వలన తాము క్షేమంగా తిరిగి రాగలిగామని వాళ్లు తమ అనుభవాలను చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుక్క రూపంలో భక్తులకు సాయపడుతూ వస్తున్నది సాక్షాత్తు భైరవుడేనని అందరూ విశ్వసిస్తుంటారు.

అంతేకాకుండా దట్టమైన ఈ అడవిలో అత్యంత విషపూరితమైన సాలె పురుగులు ... సర్పాలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. ఇక కాస్త పొద్దుపోతేచాలు పులులు ... సింహాల వంటి మృగాల అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఇంతటి భయంకరమైన ఈ అడవీ ప్రదేశంలో ఇంతవరకూ భక్తులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అందుకు కారణం కూడా ఆ శివుడి అనుగ్రహమనీ, భైరవుడి ఆశీస్సులని చెప్పుకుంటూ ఉంటారు ... ఇది మహాదేవుడు ప్రత్యక్షంగా కొలువైన మహిమాన్విత క్షేత్రమని ఒప్పుకుంటూ ఉంటారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69