ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహాదేవుడి కోవెలలో మహిమగల కోనేరు

Fri, Feb 21, 2014, 08:05 PM
Related Image కర్నూలు జిల్లా పరిధిలో గల మహానంది క్షేత్రం గురించి తెలియనివాళ్లు ఉండరు. ఈ క్షేత్రంలో ప్రతి అడుగు పవిత్రమైనదనీ ... ప్రతి రాయి మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి అడుగులోనూ పరమశివుడి లీలావిశేషాలను అద్భుతంగా ఆవిష్కరించే ఈ క్షేత్రంలో, కోనేరు కూడా ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడి కోనేరు ... అడుగుభాగం అద్దంలా కనిపించేంతటి స్వచ్ఛమైన నీళ్లను చూస్తే ఇది సాక్షాత్తు సదాశివుడి మనసు నుంచి ఉద్భవించిందేనని అనిపిస్తుంది.

చుట్టూ నీళ్లు ... మధ్యలో మంటపంగల ఈ కోనేరులో స్నానం చేయకపోతే, క్షేత్రదర్శనం ఫలితం దక్కదనే చెప్పాలి. ఇక్కడి పర్వాతాల పైభాగం నుంచి ' శ్రీశైలధార' ... ' నరసింహధార' ... 'దైవోధినిధార' ... 'నందితీర్థం' ... 'కైలాస తీర్థం' అనే అయిదు నీటి ధారలు ప్రధానమైన శివలింగం కింది నుంచి అంతర్వాహినులుగా ఇక్కడి కోనేరులో చేరుతూ ఉంటాయని భావిస్తూ ఉంటారు. పరమశివుడే ఈ ప్రవాహాలను సృష్టించాడని నమ్ముతారు.

ఈ కారణంగానే ఏ కాలంలోనూ ఇందులోని నీళ్లు పొంగిపొర్లడంగానీ ... తగ్గిపోవడంగాని జరగకపోవడం విశేషంగా చెబుతుంటారు. సువిశాలమైన ఈ కోనేరులో ఎంతమంది స్నానాలు చేసినా నీటి స్వచ్ఛత తగ్గకపోవడం ... అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియకపోవడం వలన ఈ కోనేరు మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కోనేరులో స్నానం చేయడం వలన పాపాలు ... దోషాలు ... వ్యాధులు తొలగిపోతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37