ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాధువుగా దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

Sat, Feb 08, 2014, 04:42 PM
Related Image మెదక్ జిల్లా సంగారెడ్డిలోని 'వైకుంఠపురం'లో గోదాదేవి సమేత శ్రీ విరాట్ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఇటీవల కాలంలో పునఃనిర్మాణానికి ... నూతన విగ్రహ ప్రతిష్ఠకి నోచుకున్న ఈ ఆలయం వెనుక వందల సంవత్సరాల చరిత్ర వుంది. పూర్వం ఇక్కడ వేంకటేశ్వరస్వామి వారు ఆవిర్భవించిన తీరును పరిశీలిస్తే ఇది ఎంతటి మహిమాన్వితమైన క్షేత్రమనేది అర్థమవుతుంది.

ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట. పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ దివ్యమైన తేజస్సుతో కనిపించే ఆ సాధువు సాధారణ వ్యక్తి కాదని అక్కడి ప్రజలు గమనిస్తారు. ఆయనలో ఏదో మానవాతీత శక్తి వుందని విశ్వసిస్తూ ఆశీస్సులు తీసుకునేవారు. ఒక 'శ్రీ పంచమి' రోజున శ్రీ వేంకటేశ్వరస్వామివారి విగ్రహం ఆ ప్రదేశంలో ఆవిర్భవిస్తుందనీ, ఆ స్వామి అక్కడ నిత్యపూజలు అందుకుంటాడని ఆ సాధువు జరగబోయేది చెబుతాడు.

శ్రీ పంచమి వచ్చినా ఎక్కడా ఎలాంటి సందడి లేకపోవడంతో అక్కడి భక్తులలో అనేకరకాల సందేహాలు తలెత్తుతాయి. స్వామివారి ఆవిర్భావం గురించి అడగడానికి వాళ్లంతా ఆ సాధువు దగ్గరికి వస్తారు. ఆ సమయంలోనే ఆయన స్నానానికని నీటిగుండంలోకి దిగుతుంటాడు. వాళ్లందరినీ చూస్తూ అందులో మునకేసిన సాధువు ఎంతసేపైనా తిరిగి బయటికి రాడు. దాంతో వాళ్లు కంగారుపడిపోయి నీటి గుండంలో గాలించగా వేంకటేశ్వరస్వామి విగ్రహం లభిస్తుంది.

ఆ విగ్రహం సాధువు అంతటి ఎత్తుగా వుండటం ... సాధువు నీటిలో దిగుతున్నప్పుడు ధరించిన వస్త్రం ఆ విగ్రహనికి కట్టబడి వుండటంతో వాళ్లకి విషయం అర్థమవుతుంది. సాధువు రూపంలో వచ్చిన శ్రీనివాసుడి దర్శనభాగ్యం తమకి లభించినందుకు సంతోషంతో పొంగిపోతారు. నీటి గుండంలో నుంచి బయటపడిన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకుని పూజించుకున్నారు. ఇంతటి క్షేత్ర మహాత్మ్యం కలిగిన ఈ ఆలయం నేడు ఆధునిక వైభవాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117