ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా ?

Fri, Feb 07, 2014, 02:03 PM
Related Image దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా? అనే ప్రశ్నకి .. వుంటుంది అనే సమాధానం మనకి మహారాష్ట్ర - శనిశింగణాపూర్ లో వినిపిస్తుంది. ప్రాణం వుండటం వల్లనే అక్కడ శనిదేవుడిని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. స్వామివారు ఇక్కడ ఆవిర్భవించిన తీరును గురించి తెలుసుకుంటే, వాళ్ల మాటల్లో నిజం ఉందనే విషయం అర్థమవుతుంది.

పూర్వం ఈ ప్రాంతానికి వరదలు సంభవించినప్పుడు అయిదు అడుగులపైనున్న ఒక నల్లని బండరాయి కొట్టుకుని వచ్చి ఒక చెట్టు మొదట్లో ఆగింది. వరద తగ్గుముఖం పట్టినతరువాత ఆ రాయిని కొంతమంది పశువుల కాపర్లు చూశారు. ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఆ రాయిపై ఒకడు ముల్లుగర్రతో పొడిచాడు. అంతే ... అక్కడి నుంచి రక్తం ధారగా కారసాగింది.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిగెత్తుకు వచ్చి ఆ వైనాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఆ బండరాయిని కదిలించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ రాత్రి శనీశ్వరుడు ఓ భక్తుడి కలలో కనిపించి ... శిలారూపంలో ఆ ఊరుకి వచ్చింది తానేనని చెప్పాడట. తనని ఫలానా వ్యక్తులు మాత్రమే కదిలించాలనీ ... ఫలానా ప్రదేశంలో ప్రతిష్ఠించాలని ఆదేశించాడు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆ భక్తుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. మహిమాన్వితమైన ఈ సంఘటనను గురించి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు.

శిలా రూపంలో స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ ... ఈ గ్రామానికి సంబంధించిన రక్షణ అంతా కూడా ఆయనే చూసుకుంటూ వుంటాడని భక్తులు భావిస్తుంటారు. అందువలన ఇక్కడ దొంగతనాలు వంటివి జరగవు ... స్వామిపై గల విశ్వాసంతో తలుపులకి తాళాలు వేయరు. ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేసి దొంగతనానికి ప్రయత్నించిన వాళ్లు తగిన ఫలితాన్ని అనుభవించిన దాఖలాలు ఎన్నో కనిపిస్తాయి.
X

Feedback Form

Your IP address: 54.211.121.63