ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమ్మ ఒడిలా ఆదరించే అనుగ్రహ క్షేత్రం

Fri, Jan 24, 2014, 10:17 AM
Related Image శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట శక్తుల బారి నుంచి తన బిడ్డలను కాపాడటం కోసం అనేక రూపాల్లో అవతరించింది. వివిధ పేర్లతో గ్రామదేవతగా ఆవిర్భవించి ప్రతి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలోను గ్రామదేవతగా ఓ అమ్మవారి ఆలయం కనిపిస్తూ వుంటుంది. అందుకు భిన్నంగా ఇద్దరు గ్రామదేవతలు వుండటం ... వారితో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై వుండటం మనకి విజయవాడలోని 'చిట్టినగర్' లో కనిపిస్తుంది.

ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవంగా లక్ష్మీదేవి ... ఆ పక్కనే గ్రామదేవతలుగా గంగాళమ్మ - ముత్యాలమ్మ దర్శనమిస్తూ వుంటారు. ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే వేదికపై కొలువుదీరి వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. అంటువ్యాధులు తమ ఊరు దరిదాపులకు రాకుండా ... పాడిపంటలకు ఎలాంటి లోటు రాకుండా ఈ అమ్మవార్లే రక్షిస్తూ ఉంటారని గ్రామస్తులు నమ్ముతుంటారు. అమ్మఒడి లాంటి ఈ క్షేత్రం తమ సంతాన సౌభాగ్యాలను కాపాడుతూ ఉంటుందని వాళ్లు భావిస్తూ వుంటారు.

ఈ కృతజ్ఞతతోనే ప్రతి నిత్యం అమ్మవార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ఇక్కడి అమ్మవార్లను దర్శించిన వారికి దుఃఖం దూరమవుతుందని చెబుతుంటారు. ఇక ఈ క్షేత్రంలో లక్ష్మీదేవి కొలువైన కారణంగా ఆ తరువాత కాలంలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడం జరిగింది. పద్మావతీ - గోదాదేవి సమేతంగా కొలువైన కోనేటి రాయుడిని దర్శించిన భక్తులు ధన్యులవుతుంటారు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94