ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆరోగ్యాన్నిచ్చే సంజీవరాయ పుష్కరిణి

Fri, Jan 17, 2014, 11:39 AM
Related Image సంపాదించిన ఆస్తిపాస్తులు స్థిరంగా ఉండాలన్నా ... ఆ సంపద ద్వారా సుఖ సంతోషాలు అనుభవించాలన్నా ఆరోగ్యంగా వుండటం ఎంతో అవసరం. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యమని అనుభవంతో చెప్పారు. కుటుంబంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో బాధపడుతున్నా, పరోక్షంగా ఆ బాధ అందరినీ పీడిస్తూనే వుంటుంది. గుళ్లకి ... గోపురాలకి తిప్పుతూనే వుంటుంది. ఇలా అనారోగ్యంతో బాధపడుతూ నివారణా మార్గాల కోసం అన్వేషిస్తోన్న వారికి 'సంజీవరాయ పుష్కరిణి' లోని నీరు ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది.

మహిమాన్వితమైన ఈ పుష్కరిణి చిత్తూరు జిల్లాలోని 'అరగొండ' లో దర్శనమిస్తుంది. అభయాంజనేయస్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో, సంజీవరాయ పుష్కరిణి కనిపిస్తుంది. పూర్వం రావణుడితో యుద్ధానికి దిగిన సమయంలో మేఘనాథుడితో పోరాడుతూ లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. ఆయనని తిరిగి ఈ లోకంలోకి తీసుకురావడానికి 'సంజీవిని' అనే ఔధం అవసరమని చెప్పడంతో, ఆ పర్వతాన్ని హనుమంతుడు పెకిలించుకువస్తాడు.

సంజీవనీ పర్వతాన్ని హనుమంతుడు తీసుకుని వెళుతుండగా అందులోని సగభాగం ఈ ప్రదేశంలో పడిపోయిందట. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'అరగొండ' (సగంకొండ) అనే పేరు వచ్చిందని అంటారు. ఇక ఈ అరగొండపై గల పుష్కరిణిలో స్నానం ఆచరించడం వలన ... ఈ నీటిని స్వీకరించడం వలన దీర్ఘకాలికంగా బాధిస్తోన్న మొండివ్యాధులు నయమవుతున్నట్టుగా స్థానికులు చెబుతుంటారు.

ఇక ఈ పుష్కరిణి నుంచి అప్పుడప్పుడు 'ఓంకారం' వినిపిస్తూ ఉంటుందనీ, పౌర్ణమి రోజుల్లో ఈ ధ్వని మరింత ఎక్కువ దూరం వినిపిస్తూ ఉంటుందని అంటారు. అందువలన ఈ పుష్కరిణి మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.
X

Feedback Form

Your IP address: 54.204.247.205