ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవతలు దర్శించిన దివ్యక్షేత్రం

Sat, Dec 21, 2013, 05:49 PM
Related Image క్షీరసాగర మథనంలో అమృతం వెలికి వచ్చినప్పుడు అది అసురులకు దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో, శ్రీ మహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించాడు. లోక కల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన ఆ రూపాన్ని దేవతలంతా పూజించారు. వాళ్ల అభ్యర్థన మేరకు స్వామి అక్కడ అవతరించాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'మోహనపురం' అనే పేరు వచ్చింది.

ఇక్కడి స్వామి 'కాలమేఘ పెరుమాళ్' పేరుతో కొలవబడుతున్నాడు. అత్యంత పవిత్రమైనదిగా ... మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం,'తిరుమోగూర్' పేరుతో తమిళనాడు ప్రాంతంలో ... మధుర సమీపంలో అలరారుతోంది. నమ్మాళ్వార్ ... తిరుమంగై ఆళ్వార్ లచే కీర్తించబడిన ఈ క్షేత్రంలో అమ్మవారు మేఘవల్లి తాయారు ... మోహనవల్లి తాయారుగా పిలవబడుతోంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం మనసును మంత్రిస్తుంది. ఎత్తైన రాజగోపురం ... సుందరమైన ప్రాకారాలు ... కళ్ళను కట్టిపడేసే మంటపాలు ... ఆశ్చర్యచకితులను చేసే శిల్పకళ నాటి వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. 'తాళ తామరై' నదీ తీరంలో ఆవిర్భవించిన ఈ క్షేత్రాన్ని ఎంతోమంది రాజులు దర్శించారు ... ఆ స్వామి పట్ల అసమానమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఆయన సేవలో తరించారు.

అటు చారిత్రక నేపథ్యాన్ని ... ఇటు పురాణ ప్రాశస్త్యాన్ని కలిగివున్న ఈ క్షేత్రంలో క్షీరాబ్ది పుష్కరిణి దర్శనమిస్తుంది. ఈ పుష్కరిణి నీటిని తలపై చల్లుకున్నంత మాత్రానే సమస్త పాపాలు పటాపంచలవుతాయని అంటారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్నందు వల్ల, ఈ క్షేత్రానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడీ ఉంటూనే వుంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.166.48.3