ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వివాహ సంకేతాలు

Sat, Dec 14, 2013, 05:20 PM
Related Image కల' అనేది రెండే అక్షరాలు అయినప్పటికీ అది అందమైన అనుభూతిని అందిస్తుంది ... ఒక్కోసారి ఆందోళననూ కలిగిస్తుంది. సాధారణంగా మనసు మంచిగా వున్నప్పుడు మంచికలలు ... అది కలత చెందినప్పుడు పీడ కలలు వస్తుంటాయి. అయితే మనసుపై ఎలాంటి ప్రభావాలు పెద్దగా లేనప్పుడు వచ్చే కలలు మాత్రం నిజమవుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అయితే కలలు వస్తుంటాయి ... పోతుంటాయి వాటిని గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని కొందరు తేలికగా కొట్టిపారేస్తుంటారు.

మరికొందరు కలలు ... వాటి ఫలితాలను బలంగా విశ్వసిస్తుంటారు. ఈ అభిప్రాయాలనేవి వారు పెరిగిన కుటుంబ వాతావరణాన్ని బట్టి కనిపిస్తుంటాయి. ఏదేవైనా కొన్ని రకాల స్వప్నాలు త్వరలో జరగనున్న శుభాలను ... అశుభాలను సూచిస్తూ ఉంటాయని ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి. ఇక శుభాలకి సంబంధించిన కలలను తీసుకుంటే, వీటిలో వివాహానికి సంబంధించిన కలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యువతులకి వచ్చే కొన్ని రకాల కలలు, త్వరలో వారి వివాహం జరగనుందనే విషయాన్ని సూచిస్తూ ఉంటాయని తెలుస్తోంది.

మంగళ వాయిద్యాలు ఎదురైనట్టుగా .. తమ ఇంటికి మామిడితోరణాలు కట్టినట్టుగా ... తన కుటుంబ సభ్యులకు దూరంగా వెళుతున్నట్టుగా ... తాను మరొకరి ఇంటిలో దీపం వెలిగిస్తున్నట్టుగా ... బంగారు ఆభరణాలు ధరించినట్టుగా ... చేతి నిండుగా గాజులు వేసుకుంటున్నట్టుగా ... ఆలయంలో అమ్మవారిని దర్శించి ఆమె ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా కలలో కనిపిస్తే త్వరలోనే వారి వివాహమవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70