ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సిరులనిచ్చే లక్ష్మీ దర్శనం

Fri, Dec 13, 2013, 10:37 AM
Related Image శ్రీమహాలక్ష్మి ఎక్కడ వుంటే శ్రీనివాసుడు అక్కడ వుంటాడు. అలాగే పార్వతీదేవి ఎక్కడ వుంటే పరమశివుడు అక్కడ వుంటాడు. పురాణపరమైన అనేక గాధలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా లక్ష్మీదేవి ఆవిర్భవించిన క్షేత్రం ... ఆమె కోసం శ్రీనివాసుడు వెలసిన క్షేత్రం మనకి కర్ణాటక ప్రాంతానికి చెందిన 'కల్లూరు'లో దర్శనమిస్తుంది.

ఈ ప్రాంతానికి చెందిన భక్తుడు ప్రతియేటా కొల్హాపురిలోని లక్ష్మీదేవిని దర్శించుకునే వాడట. అలా చాలాకాలం గడిచిపోయాక, వయసు పైబడటంతో అతను కొల్హాపురి వెళ్లలేకపోయాడు. ఇక అమ్మవారిని దర్శించే భాగ్యం తనకి లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మరుసటి రోజునే ఆయన తన ఇంట్లోని బండరాయిపై గంధం తీస్తుండగా ఆ రాయి లక్ష్మీదేవి రూపాన్ని సంతరించుకుంది.

అది అమ్మవారి మహిమగా భావించిన ఆ భక్తుడు దానికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అతని పొలంలో శ్రీనివాసుడి విగ్రహం బయటపడింది. తన జన్మ ధన్యమైందని భావించిన ఆ భక్తుడు అమ్మవారికి ... స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. ఈ రెండు ప్రతిమలు రెండు విధాలుగా ఆవిర్భవించినప్పటికీ, అవి ఒకే పరిమాణంలో వుండటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. లక్ష్మీదేవి ... శ్రీనివాసుడు ఆలయంలోకి చేరిన తీరు మహిమాన్వితమై వున్న కారణంగా అనతికాలంలోనే ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఇక ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి కూడా స్వయంభువు కావడం మరో విశేషంగా చెప్పుకుంటారు. వందల సంవత్సరాల ఘన చరిత్రను కలిగిన ఈ ఆలయాన్ని దర్శించడానికి వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన సంపదలు కలుగుతాయనీ ... సౌభాగ్యం సుస్థిరమవుతుందని ... ఎలాంటి అరమరికలు లేకుండా దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71